
IND vs PAK: తప్పులు సరిదిద్దుకోవాల్సిందే.. షేక్‌హ్యాండ్స్ వివాదంపై స్పందించిన పాక్ కెప్టెన్ సల్మాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) జట్లు మూడోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈసారి టైటిల్ కోసం ఫైనల్‌లో ఢీకొనబోతుండటంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉత్సాహం ఎంత ఉంటుందో, ఆటగాళ్లపై ఒత్తిడి కూడా అంతే ఉంటుంది. అది సహజమే. భారత్‌తో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో మేము ఎన్నో తప్పులు చేశాం. ఆ పొరపాట్ల వల్లే ఓడిపోయాం. తక్కువ తప్పులు చేసిన జట్టే గెలుస్తుంది. ఈసారి తప్పకుండా వాటిని సరిదిద్దుకుని విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని సల్మాన్ అఘా తెలిపారు.
Details
ఏసీసీ నియమాలను పాటిస్తాం
అదేవిధంగా, ఏసీసీ ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుతూ భారత జట్టు ఏం చేయాలనుకుంటే అదే చేయనివ్వండి. మేము మాత్రం ఏసీసీ (ACC) నియమాలను పాటిస్తాం. వారు కలవాలని వస్తే మేం ముందడుగు వేస్తాం. లేనిపక్షంలో ఏమీ చేయలేం. మా చేతుల్లో ఉన్న వాటిపైనే దృష్టి పెడతాం. బయట వచ్చే మాటలు, మీడియా కథనాలు అన్నీ పక్కన పెట్టి మా లక్ష్యంపై దృష్టి పెట్టాం. మేము ఇక్కడికి నాణ్యమైన క్రికెట్ ఆడటానికే వచ్చాం. తప్పకుండా ఫైనల్ గెలుస్తామని నమ్ముతున్నామని అన్నారు. 'కరచాలనం' (Handshake) వివాదంపై కూడా సల్మాన్ స్పందించారు.
Details
ఇది క్రికెట్ కు మంచిది కాదు
అండర్-16 రోజుల నుంచే నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నా. నా నాన్న కూడా క్రికెట్‌కు పెద్ద అభిమాని. గత 20 ఏళ్లలో మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇంతకుముందు కూడా అలాంటింది జరిగిందని వినలేదు.భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు బాగా చెడిపోయిన రోజుల్లోనూ ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు మాత్రం షేక్‌హ్యాండ్స్ ఇవ్వకపోవడం సరిగా అనిపించడం లేదు. ఇవి క్రికెట్‌కు మంచిది కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. అయితే సల్మాన్ అఘా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. భారత అభిమానులు విమర్శలు చేస్తూ - ' కరచాలనం' విషయంపై మాత్రమే స్పందించారు కానీ, పాకిస్థాన్ ఆటగాళ్లు చేసిన చేష్టలపై ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నిస్తున్నారు.