Michelle Marsh : వన్డేల్లో 17వ హాఫ్ సెంచరీని నమోదు చేసిన మిచెల్ మార్ష్
రాజ్‌కోట్‌లో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ విజృంభించాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. ఈ మ్యాచులో మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 96 పరుగులు చేశాడు. దీంతో నాలుగు పరుగల వ్యవధిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మొదట ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ మ్యాచులో 56 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ వరుసగా మూడో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మొదట వార్నర్ తో 70 పరుగులు చేసిన మార్ష్, తర్వాత స్టీవెన్ స్మిత్‌తో కలిసి రెండో వికెట్ కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
వన్డేల్లో 2200 పరుగులను పూర్తి చేసిన మార్ష్
ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్‌లలో మార్ష్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఫార్మాట్‌లో అతని చివరి సెంచరీని ఏడేళ్ల క్రితం చేశాడు. మార్ష్ ఇప్పటివరకూ 79 వన్డేల్లో 34.32 సగటుతో 2,231 పరుగులు చేశాడు. ఇక మార్ష్ వన్డేలో 200 ఫోర్లను బాదాడు. భారత్‌పై మార్ష్ చివరి ఆరు వన్డేల్లో 102*(84), సిడ్నీ, 2016, 81(65), ముంబై WS, 2023, 66*(36), విశాఖపట్నం, 2023, 47(47), చెన్నై, 2023; 4(4), మొహాలి, 2023; 96(84), రాజ్‌కోట్, 2023 పరుగులను సాధించాడు