మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కన్నుమూత
మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంఫియన్ షిప్ విక్టోరియా లీ మరణవార్త యావత్ మార్షల్ ఆర్ట్స్ రంగాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. హవాయ్‌లో పుట్టిన ఈ ఫైటర్ 18 ఏళ్లకే తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. లీ మరణ వార్తను ఆమె సోదరి ఏంజెలా లీ జనవరి 7న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. విక్టోరియా ఎలా మరణించిందో వెల్లడించలేదు. గతేడాది డిసెంబర్ 26న మరణించినట్లు ధృవీకరించింది. యూనైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిన విక్టోరియా 16 ఏళ్లకే సింగపూర్ బేస్ డ్ ప్రమోటర్ వన్ ఛాంపియన్ షిప్ తో కాంట్రాక్ కుదుర్చుకొని అపజయమెరుగని ఫైటర్ గా పేరు తెచ్చుకుంది. దీంతో ఆమెకు 'ది ప్రాడిజీ' అనే బిరుదు కూడా లభించింది.
జనవరి 22న అంత్యక్రియలు
విక్టోరియా ఫిబ్రవరి 26, 2021న అరంగేట్రం చేసింది. మొదట్లోనే సునిసా శ్రీసేన్ ను ఓడించి సత్తా చాటింది.వెంటనే జూలైలో వాంగ్ లుపింగ్‌పై విజయం సాధించి రికార్డు బద్దలు కొట్టింది. సెప్టెంబర్ 24, 2021న తన చివరి మ్యాచ్ లో విక్టోరియా సౌజాపై పంచ్ ల వర్షం కురిపించింది. విక్టోరియా సన్-హే లీ మే 17, 2004న హవాయిలోని వహియావాలో జన్మించింది, ఆమె తండ్రి కెన్ లీ కూడా ఆమెకు కోచ్‌గా ఉన్నారు. జనవరి 22న విక్టోరియాను ఖననం చేయనున్నారు.