LOADING...
Moeen Ali PSL vs IPL: ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పి పీఎస్‌ఎల్‌లోకి ఎంట్రీ.. కారణమేంటో చెప్పిన మొయిన్ అలీ
ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పి పీఎస్‌ఎల్‌లోకి ఎంట్రీ.. కారణమేంటో చెప్పిన మొయిన్ అలీ

Moeen Ali PSL vs IPL: ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పి పీఎస్‌ఎల్‌లోకి ఎంట్రీ.. కారణమేంటో చెప్పిన మొయిన్ అలీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 18, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌కు చెందిన మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను పక్కనబెట్టి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో పాల్గొనాలని తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారి తీసింది. సాధారణంగా ఐపీఎల్, పీఎస్‌ఎల్ టోర్నీలు ఒకేసారి జరుగుతుండటంతో విదేశీ ఆటగాళ్లు ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఆటగాళ్లు ఐపీఎల్‌కే ప్రాధాన్యం ఇస్తారు. అయితే మొయిన్ అలీ మాత్రం భిన్నంగా ఆలోచించి పీఎస్‌ఎల్ వైపు మొగ్గుచూపాడు.

వివరాలు

ఫ్యామిలీ కోసమే అలా చేశాడా?

ఇటీవల ఒక పోడ్కాస్ట్‌లో మాట్లాడిన మొయిన్ అలీ తన నిర్ణయానికి గల కారణాలను వివరించాడు. ప్రస్తుతం తన వయసు 38 సంవత్సరాలు అని చెప్పిన అతను, ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాలనే ఆసక్తి ఉందని తెలిపాడు. తన క్రికెట్ కెరీర్‌ను సాధ్యమైనంత ఎక్కువకాలం కొనసాగించాలని భావిస్తున్నానని పేర్కొన్నాడు. పీఎస్‌ఎల్ తక్కువ వ్యవధిలో ముగిసే టోర్నమెంట్ కావడం వల్ల అది తనకు, తన కుటుంబానికి అనుకూలంగా ఉందని చెప్పాడు. అదనంగా కరాచీ జట్టు తన నిర్ణయాన్ని గౌరవిస్తున్నదని కూడా తెలిపాడు.

వివరాలు

అవకాశాల కోసం ఎదురుచూపు..

గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మొయిన్ అలీకి ఆశించినంత అవకాశాలు లభించలేదు. రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన ఆ జట్టు అతనికి కేవలం ఆరు మ్యాచ్‌లలో మాత్రమే అవకాశమిచ్చింది. ఆ మ్యాచ్‌ల్లో కూడా అతనికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశాలు దక్కలేదు. ఈ విషయంపై స్పందించిన మొయిన్ అలీ, గత సీజన్‌లో తాను తగినంత మ్యాచ్‌లు ఆడలేదని, బ్యాటింగ్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువగా వచ్చాయని పేర్కొన్నాడు. తాను మైదానంలో ఎక్కువ సమయం గడపాలని, ముఖ్యంగా బ్యాటింగ్ చేసే అవకాశాలు కోరుకుంటున్నానని చెప్పాడు. తన కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ ఇప్పటికీ మంచి క్రికెట్ ఆడగలుగుతున్నాననే నమ్మకం తనకు ఉందని వెల్లడించాడు.

Advertisement

వివరాలు

అందుకే ఐపీఎల్‌కు దూరం..

ప్రస్తుతం పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మొయిన్ అలీ సంవత్సరానికి సుమారు రూ.2.14 కోట్ల వేతనం పొందుతున్నాడు. ఎక్కడా శాశ్వత స్థానం ఉండదని చెప్పిన అతను, తన ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలనే లక్ష్యంతో ఉన్నానని తెలిపాడు. పీఎస్‌ఎల్‌లో ఆడాలని తనకు చాలా కాలంగా కోరిక ఉన్నప్పటికీ షెడ్యూల్ సమస్యల వల్ల ఇప్పటివరకు సాధ్యపడలేదని పేర్కొన్నాడు. తన కెరీర్‌ను కొనసాగించడం, కుటుంబానికి సమయం కేటాయించడం, అలాగే ఎక్కువ అవకాశాలు పొందాలనే లక్ష్యంతో ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని మొయిన్ అలీ నిర్ణయించుకున్నాడు.

Advertisement