ప్రీమియర్ లీగ్‌లో మొహమ్మద్ సలా అరుదైన రికార్డు
ప్రీమియర్ లీగ్‌లో లివర్‌పూల్ తరుపున మొహమ్మద్ సలా అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. మాంచెస్టర్ యూనైటడ్ 7-0 తేడాతో లివర్ పూల్ ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ సలా ఓ రికార్డును సృష్టించాడు. ప్రీమియర్ లీగ్‌లో 129 గోల్స్ చేసిన ఆటగాడిగా సలా రికార్డుకెక్కాడు. గతంలో ఈ రికార్డు (128) రాభి పౌలర్ పేరిట ఉండేది. ప్రస్తుతం ఈ రికార్డును సలా బద్దలు కొట్టాడు. స్టీవెన్ గెరార్డ్, మైఖేల్ ఓవెన్ వంటి దిగ్గజాల సరసన సలా నిలవడం విశేషం. సలా మూడుసార్లు PL గోల్డెన్ బూట్‌ను గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు.
346 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్న ఇయాన్ రష్
సలా రెడ్స్ కోసం 205 మ్యాచ్‌లను ఆడి 129 గోల్స్ చేశాడు. సలా ఫామ్‌లో పడిపోయాడు మరియు ఇది ఈ సీజన్‌లో లివర్‌పూల్ ప్రణాళికలను అడ్డుకుంది. సలా ప్రీమియర్ లీగ్‌లో 25 మ్యాచ్‌లు ఆడి 11 గోల్స్ చేశాడు. ఇందులో ఏడు అసిస్ట్‌లను సాధించాడు. అదే విధంగా UEFA సీజన్‌లో ఛాంపియన్స్ లీగ్‌లో ఎనిమిది గోల్స్ సాధించాడు. ప్రీమియర్ లీగ్‌లో లివర్‌పూల్ తరుపున ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా ఉండటమే కాకుండా, సలా UEFA ఛాంపియన్స్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడం గమనార్హం. ఛాంపియన్స్ లీగ్‌లో రెడ్స్ తరఫున సలా 42 గోల్స్ సాధించాడు. లివర్‌పూల్ తరఫున ఇయాన్ రష్ 346 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.