Loading...
2027 ODI World Cup: సెలెక్టర్ల నిర్ణయాలపై మహ్మద్ కైఫ్ అసంతృప్తి.. రోహిత్, కోహ్లీపై కీలక వ్యాఖ్యలు!
సెలెక్టర్ల నిర్ణయాలపై మహ్మద్ కైఫ్ అసంతృప్తి.. రోహిత్, కోహ్లీపై కీలక వ్యాఖ్యలు!

2027 ODI World Cup: సెలెక్టర్ల నిర్ణయాలపై మహ్మద్ కైఫ్ అసంతృప్తి.. రోహిత్, కోహ్లీపై కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 19, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక అభిప్రాయాలు వెల్లడించాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుంటే ఈ ఇద్దరు దిగ్గజాల అనుభవం భారత జట్టుకు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశాడు. ఇటీవల రోహిత్ శర్మను ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తప్పించే ఆలోచనలో బీసీసీఐ సెలెక్టర్లు ఉన్నారంటూ ప్రచారం జరగడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే ఆ వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే ఖండిస్తూ, ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ రోహిత్‌కు చివరిది కాదని స్పష్టత ఇచ్చారు.

వివరాలు

వారే జట్టుకు బలం..

క్రిక్‌బజ్‌లో నిర్వహించిన చర్చలో మాట్లాడిన కైఫ్.. 2027 ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరగనున్నందున అక్కడి బౌన్స్ ఎక్కువగా ఉండే పిచ్‌లు, భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అనుభవజ్ఞుల పాత్ర కీలకమని పేర్కొన్నాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం భారత జట్టుకు పెద్ద బలమని చెప్పాడు.

యువ ఆటగాళ్లు అవకాశాలు అందుకుంటున్నా, కీలక టోర్నీల్లో అనుభవానికి ప్రత్యేకమైన విలువ ఉంటుందని గుర్తు చేశాడు.

అందుకే రాబోయే కాలంలో ఈ ఇద్దరూ ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడి ఫామ్‌ను కొనసాగించాలని సూచించాడు.

సెలెక్టర్లు ఏ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారో తనకు అర్థం కావడం లేదని, ఈ విషయంపై మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు.

వివరాలు

రోహిత్, కోహ్లీనే కీలకం..

రోహిత్, విరాట్ ప్రాధాన్యతను వివరించే క్రమంలో అర్జెంటీనా ఫుట్‌ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని కైఫ్ ఉదాహరణగా ప్రస్తావించాడు.

39 ఏళ్ల వయస్సులోనూ మెస్సీ అనుభవమే అర్జెంటీనా జట్టుకు ప్రధాన బలమని పేర్కొన్నాడు.

సెమీఫైనల్లో గోల్ చేయకపోయినా అసిస్ట్ అందిస్తూ జట్టును విజయదిశగా నడిపించాడని గుర్తుచేశాడు.

మ్యాచ్‌ను యువ ఆటగాళ్లు ముగించవచ్చు కానీ వారికి దారి చూపించే బాధ్యత అనుభవజ్ఞులదేనని చెప్పాడు.

అర్జెంటీనాకు మెస్సీ ఎంత కీలకమో, భారత జట్టుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా అంతే ముఖ్యమని కైఫ్ అభిప్రాయపడ్డాడు.

ADVERTISEMENT