
ఆ స్టార్ ఆటగాడు లేకపోవడం టీమిండియాకు పూడ్చలేని లోటు : మహ్మద్ కైఫ్
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 పోరు మొదలైపోయింది. మొదటి మ్యాచులో నేపాల్ పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.
ప్రస్తుతం అందరి దృష్టి సెప్టెంబర్ 2న శనివారం జరగనున్న ఇండియా-పాక్ కు వైపు మళ్లింది.
ఇప్పటికే టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకోకపోవడంతో తొలి రెండు మ్యాచులకు అతను దూరంగా ఉంటాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పష్టత నిచ్చారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ స్పందించాడు.
కేఎల్ రాహుల్ ఆసియా కప్ కు ఫిట్ ఉంటాడనే గ్యారంటీ లేదని, అతను అన్ ఫిట్‌గా ఉంటే టీమిండియాకు కష్టమేనని కైఫ్ చెప్పుకొచ్చాడు.
Details
కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్!
మిడిలార్డర్ బ్యాటింగ్ చేసేటప్పుడు కేఎల్ రాహుల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చే అవకాశం ఉందని, ఇప్పుడు అతను దూరం కావడం భారత్ అభిమానులు మంచిది కాదని కైఫ్ చెప్పారు.
కేఎల్ భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఉందని, అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ని ఆడించినా అతను రాణిస్తాడో లేదో కచ్చితంగా చెప్పలేమని వెల్లడించారు.
శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకోవడంతో, ఇషాన్ కిషన్ సెప్టెంబరు 2న, 4న వరుసగా పల్లెకెలెలో జరిగే పాకిస్థాన్, నేపాల్ మ్యాచ్‌లలో ఐదో స్థానంలో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇషాన్ ఇప్పటివరకూ ఆడిన ఆరు వన్డేల్లోనూ ఓపెనర్ గా మాత్రమే బరిలోకి దిగాడు. ఇంతవరకు వన్డేల్లో ఐదో స్థానంలో ఆడిన అనుభవం అతనికి లేదు.