బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్ షమీ సంచలన రికార్డు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సంచనల రికార్డును సృష్టించాడు. షమీ అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లను పడగొట్టి చరిత్రకెక్కాడు. ఈ మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా షమీ నిలిచాడు. నాగ్‌పూర్‌లో ప్రారంభమైన తొలి టెస్టులో వార్నర్ ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఉస్మాన్ ఖవాజాను సిరాజ్ ఔట్ చేశాడు. పేస్ విభాగంలో ఇప్పటివరకూ కపిల్ దేవ్, జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్, ఇషాంత్ శర్మ 400 వికెట్లు తీయగా.. ప్రస్తుతం వారి సరసన మహ్మద్ షమీ నిలిచాడు.
మహ్మద్ షమీ అరుదైన ఘనత
మహ్మద్ షమీ ఇప్పటి వరకూ టెస్టుల్లో 217, వన్డేల్లో 159, టీ20ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 50 ఓవర్లలలో 144 పరుగులు చేసి ఐదు వికెట్లను కోల్పోయింది. క్యారీ, హ్యాండ్‌స్కాంబ్ క్రీజులో నిలబడి ఆస్ట్రేలియా తరుపున పోరాడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ద్వారా సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. అదేవిధంగా గాయం కారణంగా చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా రీఎంట్రీ ఇచ్చాడు.