మూడేళ్ల తర్వాత బరిలోకి దిగి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'తో సత్తా
34 ఏళ్ల సీనియర్ బౌలర్ మోహిత్ శర్మ మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. 2014 తర్వాత పర్పుల్ క్యాప్ గెలుచుకున్న అతడు తర్వాత ఫెయిలవ్వడంతో అవకాశం దక్కలేదు. గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన తొలి మ్యాచ్ లో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లలో 18 పరుగులిచ్చ రెండు వికెట్లు తీశాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతన్ని వరించింది. 2013 సీఎస్కే తరుపున 15 మ్యాచ్‌లు ఆడిన మోహిత్ శర్మ 23 వికెట్లు సత్తా చాటాడు. ఆ తర్వాత 2015 వరకు సీఎస్కే ఆడిన మోహిత్ 2016-18లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాడు.
టీమిండియా తరుపున 26 వన్డేలు ఆడిన మోహిత్ శర్మ
మోహిత్ శర్మ 2019, 20లో ఒక మ్యాచ్ ఆడగా.. 2021, 22 మినీ వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. 2022 గుజరాత్ నెట్ బౌలర్ గా ఉన్న మోహిత్ 2023 సీజన్‌లో గుజరాత్ తరుపున తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. ఇప్పటివరకూ 88 మ్యాచ్‌లాడిన మోహిత్ శర్మ 122 వికెట్లను తీశాడు. ఇక 2013లో అంతర్జాతీయ క్రికెట్లో అతను అరంగేట్రం చేశాడు. టీమిండియా తరుపున 26 వన్డేలు ఆడి 31 వికెట్లను తీశారు. అదే విధంగా నాలుగు టీ20లు ఆడి ఆరు వికెట్లను పడగొట్టారు.