
ACA Elections : ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని పాటు మొత్తం కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఏసీఏలోని అన్ని పదవులకు ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేశారు.
దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణు కుమార్‌రాజు, కోశాధికారిగా శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు.
అయితే తుది ఫలితాలను వచ్చే నెల 8న అధికారికంగా ప్రకటించనున్నారు.
Detaila
కీలక పాత్ర పోషించిన నాని
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు దక్కించుకున్న విషయం తెలిసిందే.
అయితే వారి హాయంలో ఎన్నో ఆరోపణలొచ్చాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏసీఏకు ఎన్నికలు నిర్వహించారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం కార్యవర్గం ఏకగ్రీవ కావడంలో కీలక పాత్ర పోషించారు.