
MS Dhoni: ఎంఎస్ ధోనీ మరో రికార్డు.. ఐపీఎల్‌లో 11 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు
ఈ వార్తాకథనం ఏంటి
అభిమానులు ముద్దుగా "తలా"గా పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేయగా, అనంతరం లక్ష్యచేదనకు దిగిన చెన్నై జట్టు 19.3 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 168 పరుగులతో గెలుపొందింది.
ఈ విజయంలో చెన్నై జట్టుకు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందించిన ఘనత దక్కింది.
vivaralu
ధోనీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'
ఈ గెలుపులో ధోనీ కీలకపాత్ర పోషించాడు.కేవలం 11 బంతుల్లోనే 26 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ధోనీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'అవార్డును గెలుచుకున్నాడు.ఈ విజయం ద్వారా ఐపీఎల్ చరిత్రలో 11సంవత్సరాల రికార్డును తిరగరాశాడు.
అయితే,ఈ విజయంతో ధోనీ అరుదైన ఘనతను సాధించాడు.అతడు 43 ఏళ్లు 280 రోజుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుని, ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న అత్యంత వయోవృద్ధ ఆటగాడిగా నిలిచాడు.
ఇదివరకూ ఈ ఘనత ప్రవీణ్ తాంబే పేరిట ఉండేది.తాంబే 2014లో రాజస్థాన్ రాయల్స్ తరఫున కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఆడిన మ్యాచ్‌లో 42 ఏళ్లు 208 రోజుల వయసులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలిచాడు.
వివరాలు
'ఇది ఆరంభం మాత్రమే'...
మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ,"మా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలు రెండు కూడా చక్కగా ఆడాయి. మాకు మంచి ఆరంభం దక్కడం వల్ల ఛేదన సులభమైంది. ఓపెనర్ షేక్ రషీద్ అద్భుతంగా ఆడాడు. అతను భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాలు మా జట్టులో భాగంగా ఉంటాడని నమ్ముతున్నా. నెట్స్‌లో పేసర్‌లను, స్పిన్నర్‌లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఇది అతని ప్రయాణానికి కేవలం ఆరంభం మాత్రమే. రషీద్‌లో విపరీతమైన ప్రతిభ ఉంది. అతను ఆత్మవిశ్వాసంతో, దూకుడుగా ఆడగలడు. అలాగే నిజంగా ఈ రోజు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుకు అర్హుడు నూర్ అహ్మద్ కావాలి. అతడు ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాకు కన్నా ఎక్కువ ఈ గౌరవానికి అతడే పాత్రధారి" అని తెలిపారు.