MS Dhoni: సీఎస్‌కే మెంటార్‌గా ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్ 2027 రిటెన్షన్‌కు ముందు కీలక ప్రకటన!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 17, 2026
03:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ధోనికి కీలక బాధ్యతలను అప్పగించింది. సీఎస్‌కే మెంటార్‌గా ధోనీని నియమించినట్లు ప్రకటించింది. ఐపీఎల్ 2027 రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా వెల్లడికి ముందు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. ధోనీపై సీఎస్‌కే ప్రత్యేక పోస్టు ఈ సందర్భంగా సీఎస్‌కే తన అధికారిక ఎక్స్ ఖాతాలో ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. ఎన్నో విజయాలు, కఠిన సమయాలు, ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోయే జ్ఞాపకాలు.. మా ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎంఎస్ మా జట్టులో కీలక భాగంగా ఉన్నాడు'' అని పేర్కొంది.