
MS Dhoni : చాక్లెట్ ఇచ్చేయంటూ అభిమానిని ఆట పట్టించిన ఎంఎస్ ధోని
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను ధోని సంపాదించుకున్నాడు.
అతడు సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు అభిమానులు దాన్ని వైరల్ చేస్తుంటారు. ఎంత ఎదిగిన ఒదిగే ఉండే వ్యక్తిత్వం ఉన్న ధోని కొన్నిసార్లు అభిమానులతో సరదాగా ఉంటాడు.
తాజాగా ఆలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అమెరికాలో ఓ అభిమానికి ధోని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అయితే ఆ సమయంలో అభిమాని చాక్లెట్ల బాక్స్ ను తీసుకెళ్లారు.
ధోని చాకెట్లు ఇవ్వండని అని సరాదాగా అభిమానిని ఆడిగాడు. వెంటనే చాక్లెట్ బాక్స్ ను అభిమాని ధోనికి ఇచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు సరాదాగా కామెంట్లు పెడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అభిమాని దగ్గర చాక్లెట్ తీసుకుంటున్న ఎంఎస్ ధోని
MS Dhoni after giving the autograph to a fan:
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2023
"Give back the chocolates". 😂 pic.twitter.com/J3fF9MTKek