
MS Dhoni: 'నా మోకాలు నొప్పిగా ఉంది.. మరి దానిని ఎవరు భరిస్తారు?: ఎంఎస్ ధోనీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మైదానంలో మళ్లీ చూడాలని అభిమానులు ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆయన తప్పుకొని ఐదేళ్లు అయినప్పటికీ, ధోనీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన ధోనీ, ఇప్పుడు కేవలం ఐపీఎల్‌లో రెండు నెలలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. గత రెండు సీజన్లలో ఆయన చివరి సారి బరిలోకి దిగుతున్నారని వార్తలు వచ్చినా, ధోనీ ఆ ఊహాగానాలను కాదని ధోనీ బరిలోకి దిగడం చూశాం. ఐపీఎల్ 2026 సీజన్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఎక్కడైనా ఆయన పబ్లిక్ ఈవెంట్‌కు వెళ్ళినా "మళ్లీ ఆడాలి" అనే అభిమానుల విన్నపాలు ఆగట్లేదు.
వివరాలు
ఐపీఎల్ 2026 వచ్చే ఏడాది మార్చి నుంచి మే వరకు జరగనుంది
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీకి మరోసారి అదే ప్రశ్న వచ్చింది. ఈసారి ఆయన ఇచ్చిన జవాబు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ధోనీ మాట్లాడుతూ,"నేను ఆడతానో లేదో ఇంకా చెప్పలేను. దానికి ఇంకా చాలా సమయం ఉంది. డిసెంబర్ వరకు వేచి చూసి నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడే ఏదైనా చెప్పడం సరికాదు. సరైన సమయంలో తప్పకుండా నిర్ణయం ప్రకటిస్తాను"అని అన్నారు. వెంటనే ఒక అభిమాని "సర్, మీరు తప్పకుండా ఆడాలి" అని కోరగా, ధోనీ నవ్వుతూ "నా మోకాలు నొప్పిగా ఉంది.. మరి దానిని ఎవరు భరిస్తారు?"అని సరదాగా ప్రశ్నించారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. ఐపీఎల్ 2026 వచ్చే ఏడాది మార్చి నుంచి మే వరకు జరగనుంది.
వివరాలు
సీఎస్‌కే కొత్త కెప్టెన్ ఎవరు?
గత సీజన్‌లో రుతురాజ్ గాయపడటంతో తాత్కాలికంగా మళ్లీ ధోనీనే కెప్టెన్సీ చేపట్టారు. కానీ రాబోయే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కొత్త నాయకుడి కోసం చూస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ జాబితాలో సంజు శాంసన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీఎస్‌కే అతడిని జట్టులోకి తీసుకోవాలని భావిస్తోందన్న సమాచారం బయటకు వచ్చింది. అయితే ఈ విషయంపై సంజు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. రాజస్థాన్ జట్టే తనకు అంతా అన్నట్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధోని వ్యాఖ్యలు
Fans shouting u have to play sir
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) August 10, 2025
MS Dhoni : Who will take care of knee pain and smile 😃 pic.twitter.com/v1Msz9yval