LOADING...
Ms Dhoni: ఎంఎస్ ధోనీకి చివరి మ్యాచ్ అదేనా? చెపాక్‌లో ఎమోషనల్ ఫేర్‌వెల్ ఉంటుందా?
ఎంఎస్ ధోనీకి చివరి మ్యాచ్ అదేనా? చెపాక్‌లో ఎమోషనల్ ఫేర్‌వెల్ ఉంటుందా?

Ms Dhoni: ఎంఎస్ ధోనీకి చివరి మ్యాచ్ అదేనా? చెపాక్‌లో ఎమోషనల్ ఫేర్‌వెల్ ఉంటుందా?

వ్రాసిన వారు Moogati Shabari
May 17, 2026
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. జట్టుకు ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా, ధోనీ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఈ సీజన్ అనంతరం మహీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలకవచ్చనే ప్రచారం జోరందుకుంది. చెన్నై అభిమానులకు ఎన్నో మధుర జ్ఞాపకాలు అందించిన చెపాక్ స్టేడియంలోనే తన చివరి మ్యాచ్ ఆడాలని ధోనీ భావిస్తున్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

వివరాలు

తగ్గని మోకాలి సమస్య..

హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో సీఎస్‌కే మాజీ కెప్టెన్ ధోనీ ఇప్పటివరకు మైదానంలోకి అడుగుపెట్టలేదు. గత ఏడాది ఎదురైన మోకాలి సమస్య నుంచి కోలుకుని పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పటికీ, ఇంకా ఆడకపోవడం అభిమానుల్లో అనుమానాలకు దారితీస్తోంది. మే 15న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగుతాడని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే వరుస విజయాలతో ఉన్న జట్టు కాంబినేషన్‌ను మార్చకూడదనే ఉద్దేశంతోనే అతడిని ఆడించలేదని సమాచారం. కానీ ఆ మ్యాచ్‌లో లక్నో చేతిలో చెన్నై ఓటమిపాలవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి.

వివరాలు

ఆరోజే ఆఖరి రోజా..

ఇప్పుడు అందరి దృష్టి మే 18న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్‌పై నిలిచింది. ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేకాదు, ఇదే అతడి చివరి మ్యాచ్ కావచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. ధోనీ రిటైర్మెంట్‌ను పురస్కరించుకుని సీఎస్‌కే యాజమాన్యం చెపాక్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రిక్‌బజ్ చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. "ఐపీఎల్ 2026లో సీఎస్‌కేకు చెన్నైలో ఇక ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. అది మే 18న జరగనుంది. ఆ రోజు మొత్తం చెన్నై పసుపు రంగుతో నిండిపోయినా ఆశ్చర్యపోను. హిచ్‌కాక్ సినిమా తరహాలో ధోనీ ఒక్కసారిగా మైదానంలో కనిపించినా ఆశ్చర్యమే కాదు" అని వ్యాఖ్యానించారు.

Advertisement