LOADING...
MS Dhoni: క్రికెట్ నుంచి వ్యవసాయానికి ధోనీ ప్రయాణం
క్రికెట్ నుంచి వ్యవసాయానికి ధోనీ ప్రయాణం

MS Dhoni: క్రికెట్ నుంచి వ్యవసాయానికి ధోనీ ప్రయాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ క్రికెట్‌ ఆటగాడు ఎంఎస్ ధోని ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయంలో నిమగ్నమయ్యారు. జార్ఖండ్‌ రాష్ట్ర రాజధాని రాంచీకి సమీపంలో ఉన్న సంబో గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో ఈ సంవత్సరంలో ఆయన టమాటా పంటను సాగు చేస్తున్నారు. మొత్తం 43 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ వ్యవసాయ భూమిలో సుమారు 38 ఎకరాల వరకు టమాటాతో పాటు వివిధ రకాల కూరగాయలను పండిస్తున్నారు. టమాటాకు చెందిన కొత్త రకాల వంగడాలను ప్రవేశపెట్టడంతో పాటు, ఎలాంటి రసాయన ఎరువులు లేదా పురుగుమందులు ఉపయోగించకుండా మంచి దిగుబడిని సాధించినట్లు సమాచారం. ఆవు పేడ వంటి సహజ ఎరువులను వినియోగించి పండించిన ఈ కూరగాయలకు మార్కెట్‌లో విశేషమైన ఆదరణ లభిస్తున్నదని స్థానిక రైతులు వెల్లడించారు.

Advertisement