డ్వేన్ బ్రావో తల్లికి ఎంఎస్ ధోని శుభాకాంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో పరాజయం పాలైన చైన్నై.. రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చైన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో తల్లికి 65 ఏళ్లు పూర్తి కావడంతో.. ఎంఎస్ ధోని బ్రావో తల్లికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎంఎస్ ధోనితో పాటు చాలామంది స్టార్ ఆటగాళ్లు బ్రావో తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపారు.
చైన్నై
ఏప్రిల్ 8న ముంబైతో తలపడనున్న చైన్నై సూపర్ కింగ్స్
ఎంఎస్ ధోని తన ఇన్ స్టాగ్రామ్‌లో హాయ్ మమ్మి బ్రాబో.. మీకు 65వ పుట్టిన రోజు శుభాకాంక్షలను అని తెలిపి, తన కోసం కొంచెం కేకును తీసుకొస్తే దాన్ని బ్రావో ముఖం మీద పుస్తానని ధోని పోస్టు చేశాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌పై చైన్నై సూపర్ కింగ్స్ మొదటి విజయాన్ని నమోదు చేయడంతో ప్రస్తుతం ఆత్మవిశ్వాసంలో ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అద్భుతమైన ప్రదర్శనతో చైన్నై 217 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్నో 215 పరుగులు చేసి పరాజయం పాలైంది.
ఏప్రిల్ 8న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో చైన్నై తలపడనుంది.