Page Loader
IPL 2025: ఐపీఎల్‌ ప్లేఆఫ్‌కు ముల్లాన్‌పూర్‌ రేడీ.. నేటి మ్యాచ్‌ కోసం భారీ భద్రత!
ఐపీఎల్‌ ప్లేఆఫ్‌కు ముల్లాన్‌పూర్‌ రేడీ.. నేటి మ్యాచ్‌ కోసం భారీ భద్రత!

IPL 2025: ఐపీఎల్‌ ప్లేఆఫ్‌కు ముల్లాన్‌పూర్‌ రేడీ.. నేటి మ్యాచ్‌ కోసం భారీ భద్రత!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌ ముగింపు దశలోకి చేరుకున్న నేపథ్యంలో, ప్లేఆఫ్స్‌కు సంబంధించిన కీలకమైన మ్యాచ్‌లు ఈ వారం ప్రారంభం కానున్నాయి. లీగ్ దశ ముగిసిన నేపథ్యంలో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన పంజాబ్ కింగ్స్ మరియు రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ మే 29, గురువారం జరగనుంది. ఈ హైఓక్టేన్ మ్యాచ్‌కు పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియం వేదిక కానుంది. ఇదే వేదికపై ఎలిమినేటర్ మ్యాచ్ కూడా నిర్వహించనుండగా, భద్రతా ఏర్పాట్లు బలంగా చేపట్టారు. గత నెల 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Details

హైదరాబాద్‌లో క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచులు 

ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి 'ఆపరేషన్ సిందూర్'చేపట్టింది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఐపీఎల్‌ను బీసీసీఐ ఒక వారం పాటు నిలిపివేయాల్సి వచ్చింది. అనంతరం పరిస్థితులు మరింత స్థిరపడిన నేపథ్యంలో టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను కొత్తగా విడుదల చేశారు. ప్లేఆఫ్స్‌లోని క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచులు హైదరాబాద్‌లో, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లు కోల్‌కతాలో జరగాల్సి ఉండగా, ఇప్పుడు క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లను ముల్లాన్‌పూర్‌కు, క్వాలిఫయర్-2 ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి మార్చారు.

Details

2500 మందికి పైగా భద్రతా బలగాలు

ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఈ రెండు కీలక మ్యాచ్‌ల కోసం పంజాబ్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. పంజాబ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) అర్పితా శుక్లా వెల్లడించిన సమాచారం ప్రకారం, స్టేడియంలో 65 మంది పోలీస్ అధికారులు, 2500 మందికిపైగా భద్రతా బలగాలను మోహరించారు. దేశం నలుమూలల నుంచి అభిమానులు ఈ మ్యాచ్‌లకు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో, స్టేడియం పరిసరాల్లో విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. మ్యాచ్‌కు ముందు మాక్ డ్రిల్ కూడా నిర్వహించామని తెలిపారు.