LOADING...
MI vs PBKS: వాంఖడేలో ముంబయి చిత్తు.. పంజాబ్ చేతిలో ఘోర ఓటమి!
వాంఖడేలో ముంబయి చిత్తు.. పంజాబ్ చేతిలో ఘోర ఓటమి!

MI vs PBKS: వాంఖడేలో ముంబయి చిత్తు.. పంజాబ్ చేతిలో ఘోర ఓటమి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2026
11:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో పంజాబ్ కింగ్స్ (PBKS) జైత్రయాత్ర కొనసాగింది. ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో హోరాహోరీగా సాగిన పోరులో పంజాబ్ జట్టు 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ (MI)ను మట్టికరిపించింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. డికాక్ సెంచరీ వృథా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్‌కు ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీతో (112 పరుగులు) మెరుపులు మెరిపించాడు. అతని అద్భుత ఇన్నింగ్స్‌తో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అయితే ఈ భారీ స్కోరును కాపాడుకోవడంలో ముంబై బౌలర్లు విఫలమయ్యారు.

వివరాలు

శ్రేయస్, ప్రభ్‌సిమ్రాన్ మెరుపు బ్యాటింగ్

196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ప్రియాంశ్ ఆర్య (15) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కూపర్ కున్నోలీ (17) రెండు భారీ సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. అయితే వీరిద్దరినీ ముంబై బౌలర్ ఏ.ఎం. ఘజన్‌ఫర్ పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌లో ఉత్కంఠను తీసుకొచ్చాడు. కానీ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి ముంబై ఆశలపై నీళ్లు చల్లారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఈ సీజన్‌లో తన మూడో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. శార్దుల్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో హోరెత్తించిన అయ్యర్, 66 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు.

Advertisement