Page Loader
PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్
ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్

PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
01:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌పై ఘన విజయం సాధించి, ఆర్సీబీతో తలపడేందుకు సిద్ధమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయంగా 87* పరుగులు చేసి అద్భుత హాఫ్ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. ఈ విజయంతో పంజాబ్ ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ఫైనల్‌కు అడుగుపెట్టింది ఫలితంగా మంగళవారం జరగనున్న ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ టైటిల్ కోసం పోటీపడనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు