Rohit sharma: రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు షాక్..మరో రెండు మ్యాచులకు కూడా రాడు..అప్డేట్ ఇచ్చిన కెప్టెన్
ఈ వార్తాకథనం ఏంటి
సొంత గడ్డ వాంఖడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొడ కండరాల గాయంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కూ దూరమయ్యాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో రోహిత్ గాయం పరిస్థితిపై హార్దిక్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
వివరాలు
వరుసగా నాలుగో మ్యాచ్‌కు దూరం..
టాస్ సమయంలో తుది జట్టులో రోహిత్ శర్మ పేరు ఉంటుందని అభిమానులు ఆశించారు. రోహిత్ ఇప్పటికే గాయం నుంచి కొంతవరకు కోలుకొని నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో గత మూడు మ్యాచ్‌లకు దూరమైన అతను సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తిరిగి ఆడతాడని అనుకున్నారు. కానీ రోహిత్ వరుసగా నాలుగో మ్యాచ్‌కూ అందుబాటులో లేకపోయాడు. దీనిపై హార్దిక్ స్పందించాడు.
వివరాలు
గాయం నుంచి కోలుకోని రోహిత్..
రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించలేదని హార్దిక్ తెలిపాడు. అతని కమ్‌బ్యాక్‌కు ఇంకా కొంత సమయం పడుతుందని స్పష్టం చేశాడు. అలాగే రోహిత్ మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు కూడా దూరమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు. "రోహిత్ ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌కు రాలేదు. అతను ఆ స్థాయికి చేరేందుకు కష్టపడుతున్నాడు. ఇంకా ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మిస్ అయ్యే అవకాశం ఉంది" అని హార్దిక్ చెప్పాడు. అంతకుముందు రోహిత్ వాంఖడే మైదానంలో రన్నింగ్ సెషన్స్‌లో పాల్గొనడం, జట్టు సభ్యులతో కలిసి వార్మప్‌లు చేస్తూ కనిపించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్..
🚨 TOSS 🚨@mumbaiindians won the toss & chose to bat first against @SunRisers in Wankhede!
— IndianPremierLeague (@IPL) April 29, 2026
Updates ▶️ https://t.co/ypWTkEr2Rc#TATAIPL | #KhelBindaas | #MIvSRH pic.twitter.com/5JNhDPJD96