Page Loader
IPL 2023 : ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ విడుదల
కొత్త జెర్సీతో ముంబై ఆటగాళ్లు

IPL 2023 : ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2023
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వచ్చే ఐపీఎల్ నుంచి కొత్త జెర్సీలో దర్శనమివ్వనుంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 16వ సీజన్‌కు ముందు ముంబై కొత్త నిర్ణయం తీసుకుంది. ఏకంగా తమ జట్టు జెర్సీనే మార్చేసింది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ జెర్సీ బాగుందంటూ కితాబు ఇస్తున్నారు. పాత బ్లూ, గోల్డ్ డిజైన్ నుంచి మరీ డీవియేట్ అవ్వకుండా ముంబై ఫ్రాంచైజీ కొత్త జెర్సీని డిజైన్ చేసింది. జెర్సీపై డార్క్, లైట్ బ్లూ కలయికపై గోల్డ్ కలర్‌ గీతలు కనిపిస్తున్నాయి. కొత్త జెర్సీతో అయినా తమ అదృష్టం మారుతుందని ముంబై భావిస్తోంది.

ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ జట్టు ఇదే

2022 ఎడిషన్‌లో ముంబై 14 మ్యాచ్ లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించింది. 2023 ఐపీఎల్లో మొదటి మ్యాచ్‌ను ఏప్రిల్ 2న చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై తలపడనుంది. ముంబై జట్టుకు జస్ప్రీత్ బుమ్రా, ఝై రిచర్డ్‌సన్ గాయంతో ఐపీఎల్ దూరమయ్యారు. ముంబై ఇండియన్స్ 2023 జట్టు: రోహిత్‌శర్మ (సి), సూర్యకుమార్‌యాదవ్, ఇషాన్‌కిషన్, డెవాల్డ్ బ్రీవిస్, తిలక్ వర్మ, జోఫ్రాఆర్చర్, టిమ్‌డేవిడ్, అర్షద్ ఖాన్, రమణదీప్ సింగ్, హృతిక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండొర్ఫ్ , ఆకాష్ మధ్వల్, కామెరాన్ గ్రీన్, ఝే రిచర్డ్‌సన్, పియూష్ చావ్లా, దువాన్ జాన్సెన్, విష్ణు వినోద్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, రాఘవ్ గోయల్