
డేవిడ్ సిక్సర్ల మోత.. భారీ లక్ష్యాన్ని చేధించిన ముంబై ఇండియన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 1000వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
ముంబై 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ 62 బంతుల్లో 124 పరుగులు చేయడంతో రాజస్థాన్ భారీ స్కోరును చేసింది.
ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ 3, పీయూష్ చావ్లా 2, మెరిడిత్, అర్చర్ తలా ఓ వికెట్ తో రాణించారు.
Details
సూర్యకుమార్ యాదవ్, డేవిడ్ సంచలన ఇన్నింగ్స్
లక్ష్య చేధనకు దిగిన ముంబైకి శుభారంభం అందలేదు. బర్త్ డే బాయ్ రోహిత్ శర్మ(3) పరుగులతో నిరాశపరిచాడు. తర్వాత ఇసాన్ కిషన్, కామెరూన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఇషాన్ కిషాన్(28), గ్రీన్(44) పరుగులతో ఫర్వాలేదనిపించారు.
అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రాజస్థాన్ బౌలర్లకు తనదైన శైలిలో బ్యాట్ తో సమాధానం చెప్పాడు. కేవలం 29 బంతుల్లో 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ కు ఇది రెండో హాఫ్ సెంచరీ.
చివర్లో తిలక్ వర్మ 29(21), టిమ్ డేవిడ్ 45(14) విజృంభించారు. చివరి ఓవర్ కు 17 పరుగులు అవసరం కాగా.. టిమ్ డేవిడ్ హాట్రిక్ సిక్సర్లతో జట్టుకు విజయాన్ని అందించాడు.