Page Loader
GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం
ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం

GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
11:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ పోరులో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్ విధించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు గుజరాత్ టైటాన్స్ ఆఖరి వరకు పోరాడినా విజయం మాత్రం దక్కలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో ఆ జట్టు ఓటమిపాలైంది గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ (80 పరుగులు), సుందర్ (48 పరుగులు) మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఈ పరాజయంతో గుజరాత్ టైటాన్స్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ముంబయి ఇండియన్స్ మాత్రం క్వాలిఫయర్ 2కి అర్హత సాధించి జూన్ 1న పంజాబ్ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

20 పరుగుల తేడాతో ముంబయి గెలుపు