WPL: మరోసారి డబ్యూపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ముంబయి ఇండియన్స్
ఈ వార్తాకథనం ఏంటి
డబ్ల్యూపీఎల్ విజేతగా ముంబయి ఇండియన్స్ నిలిచింది. ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో దిల్లీని 8 పరుగుల తేడాతో ఓడించి రెండోసారి టైటిల్‌ను ముద్దాడింది.
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులకే పరిమితమైంది. రోడ్రిగ్స్ (30), మరిజేన్ కాప్ (40) మినహా ఇతర బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు.
ముంబయి బౌలర్లలో బ్రంట్ 3 వికెట్లు తీయగా, అమీలియా కెర్ 2 వికెట్లు, ఇస్మాయిల్, మ్యాథ్యూస్, ఇషాక్యూ తలో వికెట్ తీసి ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు.
దీంతో వరుసగా మూడోసారి ఫైనల్ చేరినా టైటిల్ అందుకోలేకపోయిన జట్టుగా ఢిల్లీ నిలిచింది.
Details
పోరాడి ఓడిన ఢిల్లీ
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ ఆదిలోనే కష్టాల్లో పడింది. మొదటి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు మెగ్ లాన్నింగ్ (13), షెఫాలీ వర్మ (4) పెవిలియన్‌కు చేరారు.
లాన్నింగ్‌ను బ్రంట్ బౌల్డ్ చేయగా, ఇస్మాయిల్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి వర్మ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది.
జోనాసేన్ (13) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా అమీలియా కెర్ బౌలింగ్‌లో భాటియాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది.
రోడ్రిగ్స్ నిలకడగా ఆడుతున్నా 66 పరుగుల జట్టు స్కోరు వద్ద కెర్ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగింది. చివర్లో మరిజేన్ కాప్ (40), నికీ ప్రసాద్ (25*) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.
Details
హాఫ్ సెంచరీతో రాణించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్
అంతకుముందు టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (66; 44 బంతుల్లో 9×4, 2×6) అద్భుత ఇన్నింగ్స్ ఆడింది.
నాట్ సీవర్ (30) మోస్తరుగా రాణించగా, కమలిని (10), అమన్‌జోత్ కౌర్ (14*), సంస్కృతి గుప్తా (8*) కొంత సమిష్టిగా స్కోరు జోడించారు. అమీలియా కెర్ (2), సజీవన్ సజన (0) విఫలమయ్యారు.
బౌలింగ్ విభాగంలో దిల్లీ తరఫున మరిజేన్ కాప్ 2, జెస్ జోనాస్సెన్ 2, చరణి 2, అన్నాబెల్ సదర్లాండ్ 1 వికెట్ తీశారు.