Page Loader
MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ
ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ

MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
11:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ముంబయి జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ముందుగా ముంబయి నిర్ణయించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 121 పరుగులకే ఆలౌటైంది. సమీర్ రిజ్వీ (39) మినహా ఇతర బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. బౌలింగ్ విభాగంలో శాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా తలో మూడేసి వికెట్లు పడగొట్టగా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కరుణ్ శర్మ ఒక్కో వికెట్ తీసి ఢిల్లీని కట్టడి చేశారు. ఇదిలా ఉండగా, ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కు గుజరాత్, బెంగళూర్, పంజాబ్, ముంబయి ఇండియన్స్ చేరాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫ్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టిన ముంబయి