LOADING...
UPWw vs MIw: యూపీ చేతిలో ఓడిన ముంబయి.. ప్రతీకారం తీర్చుకుంటుందా?
యూపీ చేతిలో ఓడిన ముంబయి.. ప్రతీకారం తీర్చుకుంటుందా?

UPWw vs MIw: యూపీ చేతిలో ఓడిన ముంబయి.. ప్రతీకారం తీర్చుకుంటుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

డబ్ల్యూపీఎల్‌-2026లో భాగంగా నేడు రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో తొలి మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుండగా, యూపీ వారియర్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లు (UPWw vs MIw) ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ముంబయి నాలుగు మ్యాచ్‌లు ఆడి, రెండు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యూపీ వారియర్స్‌ నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి, మూడు ఓటములతో చివరి అంటే ఐదో స్థానంలో నిలిచింది.

Details

యూపీకి ఈ మ్యాచ్ ఎంతో కీలకం

ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ ముంబయిపై విజయం సాధించింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ముంబయి ఇండియన్స్‌ ఈ మ్యాచ్‌లో పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు పాయింట్ల పట్టికలో నిలదొక్కుకునేందుకు యూపీకి ఈ మ్యాచ్‌ ఎంతో కీలకంగా మారింది.

Advertisement