Murugan Ashwin: దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌కు మురుగన్ అశ్విన్ వీడ్కోలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత లెగ్‌స్పిన్నర్ మురుగన్ అశ్విన్ తన క్రికెట్ ప్రయాణంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు సోమవారం వెల్లడించాడు. 35ఏళ్ల అశ్విన్ తన నిర్ణయాన్ని సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. సుదీర్ఘ ప్రకటన విడుదల చేసిన ఆయన, దేశవాళీ క్రికెట్ కెరీర్‌తో పాటు ఐపీఎల్ ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. అయితే పోటీ క్రికెట్‌కు పూర్తిగా దూరం కావడం లేదని, కొత్త అవకాశాలు,సవాళ్ల వైపు అడుగులు వేయాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. ఐపీఎల్‌లో మురుగన్ అశ్విన్ అనేక జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
వివరాలు
తమిళనాడు క్రికెట్ సంఘానికి అశ్విన్ కృతజ్ఞతలు
రైజింగ్ పుణె సూపర్‌జెయింట్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల తరఫున బరిలోకి దిగాడు. ఈ క్రమంలో మహేంద్రసింగ్ ధోనీ,విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ వంటి ప్రముఖ ఆటగాళ్ల నాయకత్వంలో ఆడే అవకాశం రావడం తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నాడు. ఆ అనుభవాలు తనను మరింత మెరుగైన క్రికెటర్‌గా తీర్చిదిద్దాయని గుర్తుచేశాడు. తమిళనాడు క్రికెట్ సంఘానికి కూడా అశ్విన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. తమిళనాడు తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా తన ప్రయాణాన్ని ముగించడం గర్వంగా ఉందని చెప్పాడు. తనలో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని, భవిష్యత్తులో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని మురుగన్ అశ్విన్ స్పష్టం చేశాడు.