LOADING...
IPL 2025 Final: నా కలను నిజం చేశారు.. ఆర్సీబీ విజయం‌పై విజయ్ మాల్యా హర్షం!
నా కలను నిజం చేశారు.. ఆర్సీబీ విజయం‌పై విజయ్ మాల్యా హర్షం!

IPL 2025 Final: నా కలను నిజం చేశారు.. ఆర్సీబీ విజయం‌పై విజయ్ మాల్యా హర్షం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఎన్నో సార్లు ఆశలు ఇచ్చి చివర్లో నిరాశపరిచిన ఆర్సీబీ.. ఈసారి అభిమానుల కలను నిజం చేస్తూ చాంపియన్‌గా నిలిచింది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో బెంగళూరు వీధుల నుంచి సోషల్ మీడియా వరకు ఆర్సీబీ అభిమానులు జోష్‌లో మునిగిపోయారు. ఎందుకంటే ఇది కేవలం గెలుపు కాదు, 18 ఏళ్ల నిరీక్షణకు తగిన ఫలితం.

Details

విజయ్ మాల్యా స్పందన

ఆర్సీబీ తొలి టైటిల్‌పై జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా స్పందించారు. RCB జట్టును ప్రారంభించినప్పటి నుంచే బెంగళూరుకు ఐపీఎల్ ట్రోఫీ రావాలని కలగన్నాను. యువ ఆటగాడిగా కోహ్లీని ఎంపిక చేసుకోవడం నా అదృష్టం. అతడు 18 ఏళ్లుగా ఆర్సీబీకి అంకితంగా ఉన్నాడు. అలాగే గేల్, డివిలియర్స్ లాంటి దిగ్గజాలను కూడా ఎంపిక చేసిన గౌరవం నాకు లభించింది. చివరకు ఆ ట్రోఫీ బెంగళూరుకు వచ్చింది. నా కలను నిజం చేసిన జట్టుకూ, స్టాఫ్‌కూ, అభిమానులకూ అభినందనలు. ఈ సాలా కప్ బెంగళూరుదే ఆయన అని ట్వీట్ చేశారు.

Details

 కోహ్లీ - డివిలియర్స్ ఎమోషనల్ మోమెంట్

ఈ చారిత్రక విజయం తర్వాత మరో హృదయాన్ని తాకే సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ తన సహచరుడు, మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ను హత్తుకుని తన హర్షాన్ని వ్యక్తపరిచాడు. డివిలియర్స్ కూడా స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు హాజరయ్యాడు. ఆ ఇద్దరూ ట్రోఫీతోపాటు జట్టుతో కలిసి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. వారి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.