LOADING...
Shreyas Iyer: నా కుటుంబాన్ని దూషిస్తున్నారు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై శ్రేయస్ అయ్యర్ సోదరి ఆవేదన
నా కుటుంబాన్ని దూషిస్తున్నారు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై శ్రేయస్ అయ్యర్ సోదరి ఆవేదన

Shreyas Iyer: నా కుటుంబాన్ని దూషిస్తున్నారు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై శ్రేయస్ అయ్యర్ సోదరి ఆవేదన

వ్రాసిన వారు Jayachandra Akuri
May 26, 2026
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యారు. పంజాబ్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోవడంతో కొందరు ట్రోలర్స్ ఆమెను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో శ్రేష్ఠ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రెండు భాగాలుగా వీడియో విడుదల చేశారు. ఈ వివాదానికి కారణం కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR)తో జరిగిన మ్యాచ్. వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్‌కు ఒక పాయింట్ దక్కింది. ఐపీఎల్ 2026లో వారికి లభించిన తొలి పాయింట్ అదే. ఈ సందర్భంలో శ్రేష్ఠ పంజాబ్ కింగ్స్ జెర్సీ ధరించి సరదాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వివరాలు

వీడియోను డిలీజ్ చేసిన శ్రేష్ఠ

"మేము పంజాబీలు.. మా మనసు చాలా పెద్దది. అందుకే మీకు ఒక పాయింట్ ఇచ్చామంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఆ వీడియో కొందరు అభిమానులకు నచ్చకపోవడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ప్రారంభమైంది. విమర్శలు ఎక్కువ కావడంతో శ్రేష్ఠ ఆ వీడియోను తర్వాత డిలీట్ చేశారు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2026లో తొలి ఏడు మ్యాచ్‌లలో అజేయంగా కొనసాగిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. జట్టు నిష్క్రమణ తర్వాత ట్రోలింగ్ మరింత పెరగడంతో శ్రేష్ఠ స్పందించారు. "నేను చేసిన రీల్ సరదా కోసమే. ఎవరినీ అవమానించే ఉద్దేశం నాకు లేదు. నేను ప్రతి ఆటగాడిని నేను గౌరవిస్తాను.

వివరాలు

ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందా

కానీ కొందరు నా కార్యాలయానికి ఫోన్లు చేసి నన్ను, నా సహోద్యోగులను, విద్యార్థులను, నా కుటుంబాన్ని దారుణంగా దూషిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "నా సోదరుడు గెలిచినా, ఓడినా నేను ఎప్పుడూ అతనికి మద్దతుగా ఉంటాను. ఆటగాళ్ల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దూషించడం ఏమాత్రం సమంజసం కాదని శ్రేష్ఠ పేర్కొన్నారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ఆమె ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, పంజాబ్ కింగ్స్ తమ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది . పంజాబ్ 14 మ్యాచ్‌లలో 15 పాయింట్లతో ఐదో స్థానంలో ముగించిన పంజాబ్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది.

Advertisement