
వినేశ్ ఫొగాట్‌కు NADA నోటీసులు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత అగ్రశేణీ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) నోటీసులు జారీ చేసింది. డోపింగ్ నిరోధక నిబంధనలను పాటించడంలో ఆమె విఫలమైనందుకు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది.
డోపింగ్ నిరోధక నియమాలు పాటించడంలో వినేశ్ విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆ నోటీసుల్లో వివరణ ఇచ్చింది.
యాంటీ డోపింగ్ నిబంధనల కింద ప్రతి త్రైమాసికానికి ముందు ఆటగాళ్లు ఎక్కడున్నారో ఫైల్ చేయాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజిస్టర్ టెస్టింగ్ ఫూల్ లో ఫోగాట్ పేరును చేర్చినట్లు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తెలిపింది.
Details
14 రోజుల్లో స్పందించాలన్న ఏజెన్సీ
యాంటీ డోపింగ్ నిబంధనల కింద ప్రతి త్రైమాసికానికి ముందు ఎక్కడున్నారన్న విషయాన్ని ముందు ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ఆ త్రైమాసికంలో ఆమె ఏ రోజు ఎక్కడుంటారన్న స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాలి. అదే విధంగా తాము చెప్పిన ప్రదేశంలో చెప్పిన సమయానికి డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉండాల్సి ఉంటుందని ఏజెన్సీ ఆ నోటీసుల్లో పేర్కొంది.
జూన్ 27న ఉదయం 10 గంటలకు హరియాణాలోని సోనిపట్‌లో టెస్టింగ్‌కు అందుబాటులో ఉంటానని వినేశ్ ప్రకటించారు.
వినేశ్ చెప్పిన సమయానికి అందుబాటులోకి రాకపోవడంతో డీసీవో అధికారులు టెస్టింగ్ చేయలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే వినేశ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోందని ఏజెన్సీ నోటీసుల్లో తెలిపింది.
ఈ నోటీసులపై 14 రోజుల్లో తన స్పందన తెలియజేయాలని వినేశ్‌ను ఏజెన్సీ ఆదేశించింది.