Ind Vs Aus: షేన్‌వార్న్ రికార్డును బద్దలు కొట్టిన నాథన్ లియోస్
ఈ వార్తాకథనం ఏంటి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. పేస్‌కు అనుకూలిస్తుందనుకున్న పిచ్‌పై స్పిన్ బౌలర్లు చెలరేగుతున్నారు. మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్ వరుసగా వికెట్లు తీస్తూ టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు.
వీరద్దరూ చెలరేగడంతో 12 ఓవర్లలో టీమిండియా 46 పరుగులు చేసి ఐదు వికెట్లను కోల్పోయింది. మొదటగా కెప్టెన్ రోహిత్ శర్మను కుహ్నెమన్ అవుట్ చేసి ఆసీస్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ వికెట్లను కుహ్నెమన్ పడగొట్టాడు.
నాథన్ లియోన్ ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా వికెట్లను తీసి తన ఖాతాలో వేసుకొని అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు.న్నాడు.
నాథన్ లియోన్
ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నాథన్ లియోన్
ఆసియాలో అత్యధిక వికెట్టు తీసిన బౌలర్ గా నాథన్ లియోన్ ప్రస్తుతం చరిత్రకెక్కాడు. ఆసియాలో లియోన్ ది 128 వికెట్లు తీయడం గమనార్హం. ఈ క్రమంలో అతడు ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ పేరిట ఉన్న రికార్డును నాథన్ బద్దలు కొట్టాడు.
ఆసియాలో ఇప్పటివరకూ నాథన్ (128) వికెట్లు, షేన్ వార్న్ (127), డానియెల్ వెటోరి (98), డెయిల్ స్టెయిన్ (92) వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.