అరుదైన రికార్డు చేరువలో నాథన్ లియాన్.. డబ్య్లూటీసీ ఫైనల్లో సాధించగలడా..?
ఈ వార్తాకథనం ఏంటి
మరో రెండు రోజుల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథల్ లియాన్ ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు.
అతను ఎప్పుడూ అంచనాలకు మంచి ప్రదర్శన చేస్తూ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడు. తమ జట్టులో ఉన్న ఇతర బౌలర్లు విఫలమైనా నాథన్ లియాన్ మాత్రం తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేస్తూ ఉంటాడు.
లియాన్ ఇప్పటివరకూ 119 టెస్టులో 31.23 సగటులతో 482 వికెట్లు పడగొట్టాడు.
టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కూడా అతను రికార్డుకెక్కాడు.
Details
నాథన్ లియాన్ కు టీమిండియాపై అద్భుత రికార్డు
షేన్ వార్న్ 708 వికెట్లతో మొదటి ఉండగా.. గ్లెన్ మెక్ గ్రాత్ 563 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. టెస్టు చరిత్రలో 500 వికెట్ల క్లబ్ లో చేరడానికి అతను కేవలం 18 వికెట్ల దూరంలో ఉన్నాడు. అదే విధంగా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్ గా లియాన్ చరిత్రకెక్కాడు.
లియాన్ కు టీమిండియాపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకూ భారత్ తో ఆడిన 26 టెస్టుల్లో 32.4 సగటుతో 116 వికెట్లను పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్ మాత్రమే 139 వికెట్ల తో భారత్ పై ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచాడు.
డబ్య్లూటీసీ ఫైనల్లో లియాన్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.