Neeraj Chopra: ఓ ఇంటివాడైన ఒలింపిక్స్ పతక విజేత నీరజ్ చోప్రా .. అమ్మాయి ఎవరంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) పెళ్లి పీటలు ఎక్కి ఓ ఇంటివాడయ్యాడు.
హిమానీతో నీరజ్ చోప్రా వివాహం రెండు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని నీరజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ వివాహం ఇరు కుటుంబాలకు చెందిన వారి, సన్నిహితుల సమక్షంలో సాదాసీదాగా జరిగినట్లు సమాచారం. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నీరజ్ పేర్కొన్నాడు.
వివరాలు
తల్లితో దిగిన ఒక ఫొటో
హిమానీ సోనీపట్ ప్రాంతానికి చెందినవారిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
మరోవైపు, నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో టోక్యో, పారిస్ ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలను గెలుచుకుని ఘనత సాధించాడు.
తన వివాహానికి సంబంధించి ముందస్తుగా ఎలాంటి ప్రకటన చేయని నీరజ్ చోప్రా, పెళ్లి గురించి ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికలపై మూడు ఫొటోలను షేర్ చేసి ఆశ్చర్యానికి గురిచేశాడు.
వాటిలో తన తల్లితో దిగిన ఒక ఫొటో కూడా ఉంది. కొత్త జంటకు సోషల్ మీడియా ద్వారా అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హిమానీతో నీరజ్ చోప్రా పెళ్లి
जीवन के नए अध्याय की शुरुआत अपने परिवार के साथ की। 🙏
— Neeraj Chopra (@Neeraj_chopra1) January 19, 2025
Grateful for every blessing that brought us to this moment together. Bound by love, happily ever after.
नीरज ♥️ हिमानी pic.twitter.com/OU9RM5w2o8