Page Loader
Manu Bhaker: నీరజ్‌ చోప్రాకు గాయం.. స్పందించిన మను బాకర్‌ 
నీరజ్‌ చోప్రాకు గాయం.. స్పందించిన మను బాకర్‌

Manu Bhaker: నీరజ్‌ చోప్రాకు గాయం.. స్పందించిన మను బాకర్‌ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2024
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత 'గోల్డెన్‌ బాయ్' నీరజ్‌ చోప్రా గాయాల వల్ల సతమతమవుతున్నాడు. అయినా తన పోరాట స్ఫూర్తితో మరోసారి మెరిశాడు. గజ్జల్లోని గాయం, ఎడమ చేతి ఎముక విరిగినప్పటికీ, నీరజ్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో పోటీపడటం విశేషం. ఈ పోటీలో కేవలం 1 సెంటిమీటర్‌ తేడాతో మొదటి స్థానాన్ని కోల్పోయి రెండో స్థానంలో నిలిచాడు. డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ అనంతరం తన చేతి గాయాన్ని బయటపెట్టిన నీరజ్, సోషల్ మీడియా ద్వారా తన ఎక్స్‌రే ఫోటోను షేర్ చేశారు. ఈ ఏడాదిలో తన చివరి పోటీ ఇదేనని, పూర్తిగా కోలుకుని వచ్చే సీజన్‌‌లో సత్తా చూపుతానని వెల్లడించాడు.

Details

రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలి

ఒలింపిక్ డబుల్‌ మెడలిస్ట్‌, స్టార్ షూటర్ మను బాకర్ నీరజ్‌ చోప్రాకు మద్దతు తెలుపుతూ ఓ సందేశాన్ని షేర్‌ చేసింది. నీరజ్‌ ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, మను బాకర్ తన ట్విట్టర్‌లో స్పందించింది. 2024 సీజన్‌ను అద్భుతంగా ముగించిన నీరజ్‌ చోప్రాకు తన హృదయపూర్వక అభినందనలని చెప్పారు. గాయాలు త్వరగా నయం కావాలని, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నానని అమె పేర్కొంది. మను బాకర్‌ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.