LOADING...
T20 WC : పోరాడి ఓడిన నేపాల్.. ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ గెలుపు
పోరాడి ఓడిన నేపాల్.. ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ గెలుపు

T20 WC : పోరాడి ఓడిన నేపాల్.. ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ గెలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2026
06:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో నేపాల్‌ ఇంగ్లాండ్‌పై గట్టి పోరాటపటిమ చూపినా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. 185 పరుగుల లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించిన నేపాల్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టంతో 180 పరుగులు మాత్రమే సాధించింది. జట్టులో దీపేంద్ర సింగ్‌ 44, రోహిత్‌ 39, లోకేశ్‌ బామ్‌ 39, కుశాల్‌ 29 పరుగులతో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లియామ్‌ 2 వికెట్లు తీయగా, జోఫ్రా, విల్‌ జాక్స్‌, సామ్‌ కరన్‌, ల్యూక్‌ ఒక్కో వికెట్‌ తీయగలిగారు.

Advertisement