LOADING...
PSL 2026: 'ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు'.. పీఎస్‌ఎల్‌లో పింక్ బాల్ వివాదంపై లబుషేన్ ఆగ్రహం
'ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు'.. పీఎస్‌ఎల్‌లో పింక్ బాల్ వివాదంపై లబుషేన్ ఆగ్రహం

PSL 2026: 'ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు'.. పీఎస్‌ఎల్‌లో పింక్ బాల్ వివాదంపై లబుషేన్ ఆగ్రహం

వ్రాసిన వారు Moogati Shabari
Mar 27, 2026
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ మొదటి మ్యాచ్ నుంచే వివాదం మొదలైంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ మధ్య జరిగిన మ్యాచ్ అనూహ్యంగా "పింక్ బాల్ మ్యాచ్"గా మారి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. హైదరాబాద్ కింగ్స్‌మెన్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. తమ జట్టు జెర్సీ రంగు బంతిపై పడుతూ, తెల్ల బంతి క్రమంగా పింక్, తర్వాత ఎరుపు రంగులోకి మారుతోందని ఆయన గుర్తించాడు. సాధారణంగా బంతిని మెరుగు ఉంచేందుకు ఆటగాళ్లు దుస్తులపై రుద్దడం చేస్తుంటారు. అయితే దుస్తుల రంగు బంతిపై పడడం తన కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదని లబుషేన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

వివరాలు 

ఫ్రాంచైజీలపై ఫైర్

రెండో ఓవర్ తర్వాతనే అంపైర్లను అడిగానని, బంతి ఎరుపు రంగులోకి మారుతోందని, ఇలాంటిది తాను ఎప్పుడూ చూడలేదని మ్యాచ్ అనంతరం ఆయన మీడియాతో చెప్పాడు. ఈ సమస్యను ఫ్రాంచైజీ యాజమాన్యం త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు లబుషేన్ తెలిపాడు. ఇక మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ విజయం సాధించగా, హైదరాబాద్ కింగ్స్‌మెన్ సోషల్ మీడియాలో సరదాగా స్పందించింది. "మొదటి పింక్ బాల్ మ్యాచ్ గెలిచినందుకు అభినందనలు" అంటూ పోస్టు చేసింది. ఈ ఘటన పీఎస్‌ఎల్‌కు ఇబ్బందికరంగా మారింది. ప్రొఫెషనల్ టోర్నమెంట్‌లో ఇంత నాసిరకం కిట్లు ఎలా ఉపయోగించారంటూ అభిమానులు ఫ్రాంచైజీలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్: 

Advertisement