ICC New Rule : ఓవర్ల మధ్య ఆలస్యమైతే ఐదు పరుగుల పెనాల్టీ.. ఐసీసీ కొత్త నిబంధనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మరో నూతన విధానాన్ని తీసుకొచ్చింది.
మునపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ బౌలింగ్ చేయడానికి బౌలింగ్ జట్టు సిద్ధంగా ఉండాలి.
ఒకవేళ ఆలస్యం చేస్తే పరుగుల పెనాల్టీ పడనుంది. ఇలా చేసిన మొదటి, రెండు సార్లు వార్నింగ్ ఇస్తారు.
మూడోసారి మళ్లీ రిపీట్ చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగుల పెనాల్టీ వేయనున్నారు.
రాబోయే డిసెంబర్ నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
Details
రేపటి నుంచి ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య టీ20 సిరీస్
అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
వన్డేలు, టీ20లలో బౌలింగ్ చేసే జట్టు ఒక ఓవర్ పూర్తి చేశాక ఒక నిమిషంలో మరో ఓవర్ వేయాలి.
ఈ మేరకు కొత్తగా 'స్టాప్ క్లాక్' విధానాన్ని తీసుకొచ్చింది.
ఒకవేళ సకాలంలో బౌలింగ్ జట్టు ఈ నిబంధనలను మూడుసార్లు ఉల్లంఘిస్తే ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు దక్కనున్నాయి.
ఇదిలా ఉండగా, రేపటి నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది.