LOADING...
IND vs SA 3rd ODI: నూతన రికార్డు.. వరుసగా 20సార్లు టాస్ ఓడిన భారత్.. ఎట్టకేలకు 21వ సారి గెలుపు!
నూతన రికార్డు.. వరుసగా 20సార్లు టాస్ ఓడిన భారత్.. ఎట్టకేలకు 21వ సారి గెలుపు!

IND vs SA 3rd ODI: నూతన రికార్డు.. వరుసగా 20సార్లు టాస్ ఓడిన భారత్.. ఎట్టకేలకు 21వ సారి గెలుపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2025
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో కీలకమైన మూడో, చివరి వన్డే ఈరోజు (డిసెంబర్ 6) విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ విషయంలో భారత జట్టు అరుదైన రికార్డుకు ముగింపు పలికింది. చాలా కాలం తర్వాత టాస్ గెలిచిన భారత్, ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియాకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహిస్తుండగా, దక్షిణాఫ్రికా జట్టుకు టెంబా బావుమా నాయకత్వం వహిస్తున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ను ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో భారత్ ఆడుతోంది. ఇదే సమయంలో టాస్ విషయంలో ఒక ఆసక్తికర రికార్డును భగ్నం చేసింది.

Details

భారత్ తర్వాతి స్థానంలో నెదర్లాండ్

వరుసగా 20 వన్డేల్లో టాస్ ఓడిన టీమిండియా, 21వ వన్డేలో చివరకు టాస్ గెలిచింది. 2023 ప్రపంచకప్ ఫైనల్ నుంచి రెండో వన్డే వరకు భారత్ టాస్‌లో ఓటములు ఎదుర్కొంటూ వచ్చింది. వరుస టాస్ ఓటముల్లో ప్రస్తుతం భారత్ ఇదే రికార్డు టాప్‌లో ఉంది. భారత్ తర్వాతి స్థానంలో నెదర్లాండ్ ఉంది. ఆ జట్టు 2011 మార్చి నుంచి 2013 ఆగస్టు వరకు వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. టీమిండియా వరుస టాస్ ఓటములు అభిమానుల్లో చర్చనీయాంశంగా నిలిచాయి. మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్ కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక్క మార్పు చేసింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా మాత్రం రెండు మార్పులు చేసింది.

Details

ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే

గాయంతో నాండ్జ్ బర్గర్, టోనీ డి జోర్జీ అందుబాటులో లేకపోవడంతో, వారి స్థానాల్లో ఫాస్ట్ బౌలర్ ఓట్నియల్ బార్ట్‌మన్, బ్యాట్స్‌మన్ ర్యాన్ రికెల్టన్‌ను చేర్చింది. భారత జట్టు ఇదే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ. దక్షిణాఫ్రికా జట్టు ఇదే క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్, టెంబా బావుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రూవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి మరియు ఓట్నీల్ బార్ట్‌మన్.

Advertisement