AFG vs NZ: నాలుగో రోజు న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ ఆట రద్దు
గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రద్దయే పరిస్థితి నెలకొంది. మైదానం పూర్తిగా చిత్తడిగా మారడంతో, నాలుగో రోజు ఆటను అంపైర్‌లు రద్దు చేశారు. నాలుగో రోజు ఆటను నిర్వహించాలని అంపైర్‌లు భావించినప్పటికీ, నోయిడాలో కురిసిన భారీ వర్షం వల్ల మైదానం చిత్తడిగా మారింది. ఈ నేపథ్యంలో మైదానం మొత్తాన్ని గ్రౌండ్ స్టాప్ కవర్లతో నింపారు. ప్రస్తుతం అక్కడ తేలికపాటి జల్లులు పడుతుండడంతో మైదానం ఇంకా తడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాచ్ రద్దుపై నేడు అంపైర్లు కీలక ప్రకటన
అఫ్గానిస్తాన్ కూడా ఈ టెస్టు మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ టెస్టు మ్యాచ్ సోమవారం ప్రారంభం కావాల్సి ఉంది. కుండపోత వర్షం వల్ల మైదానం పాడైపోయింది. మైదానాన్ని సిద్ధం చేయడం కోసం గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఇక అఫ్గాన్ క్రికెటర్లు కూడా నోయిడా మైదానంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్‌ను కొనసాగించాలా లేక రద్దుచేయాలా అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.