Page Loader
న్యూజిలాండ్ జ‌ట్టుకు గుడ్ న్యూస్.. నెట్స్ లో బ్యాట్ పట్టిన కేన్ విలియమ్సన్
నెట్స్ లో బ్యాట్ పట్టిన కేన్ విలియమ్సన్

న్యూజిలాండ్ జ‌ట్టుకు గుడ్ న్యూస్.. నెట్స్ లో బ్యాట్ పట్టిన కేన్ విలియమ్సన్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 01, 2023
06:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

వ‌న్డే ప్రపంచ కప్ ముంగిట న్యూజిలాండ్‌ టీమ్​కు గుడ్ న్యూస్ అందింది. ఆజట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ మళ్లీ బ్యాట్ పట్టాడు. ఈ మేరకు నెట్స్ లో ప్రాక్టీస్ మొద‌లెట్టాడు. గాయం నుంచి కోలుకుంటున్న కేన్ మళ్లీ బ్యాట్ పట్టడంతో కివీస్ జట్టుకు కొండంత బలం వచ్చినట్టైంది. ఈ మేరకు నెట్స్‌లో సాధ‌న చేస్తున్న వీడియోను కేన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. చాలా రోజులకు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండటం సంతోషంగా ఉందని ట్యాగ్ లైన్ రాసుకొచ్చాడు. తాజా వీడియోలో విలియ‌మ్స‌న్ ఏ ఇబ్బంది లేకుండా అన్ని ర‌కాల షాట్లను ప్రాక్టీస్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గాయం కారణంగా కేన్స్ 5నెల‌ల‌కు పైనే జట్టుకు దూరమయ్యారు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

Instagramలో కేన్స్ చేసిన పోస్ట్