Loading...
India-New Zealand Series: భారత్‌-న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఫుల్‌ క్రేజ్‌.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు
భారత్‌-న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఫుల్‌ క్రేజ్‌.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు

India-New Zealand Series: భారత్‌-న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఫుల్‌ క్రేజ్‌.. హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా వచ్చే వారం నుంచి వరుస సిరీస్‌లతో బిజీ కానుంది. సెప్టెంబరు 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ తలపడుతుంది. ఆ తర్వాత ఆసియా క్రీడల్లో పాల్గొనడంతో పాటు వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ పర్యటనలు ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌ టూర్‌కు బయలుదేరుతుంది. న్యూజిలాండ్‌ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత్‌ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబరు 22న క్రైస్ట్‌చర్చ్‌లో జరిగే తొలి టీ20తో టీమ్ఇండియా పర్యటన ప్రారంభమవుతుంది. అనంతరం రెండో టీ20 కూడా క్రైస్ట్‌చర్చ్‌ వేదికగానే జరగనుంది.

వివరాలు 

2019 తర్వాత తొలిసారి..

2019 తర్వాత తొలిసారిగా భారత క్రికెట్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుండటంతో ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లకు అభిమానుల్లో ఇప్పటికే విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతుండటమే దీనికి నిదర్శనం.

సోమవారం నుంచి సాధారణ ప్రజలకు మ్యాచ్‌ టికెట్ల విక్రయాలను ప్రారంభించినట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.

క్రైస్ట్‌చర్చ్‌లో భారత్‌తో జరగనున్న రెండో టీ20 సహా పలు మ్యాచ్‌ల టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయని పేర్కొంది.

రెండో టీ20కి సంబంధించిన టికెట్లలో ఇప్పటికే 75 శాతం విక్రయాలు పూర్తయ్యాయని వెల్లడించింది.

వివరాలు 

ఈడెన్‌ పార్క్‌లోనూ ఫుల్‌ క్రేజ్‌..

అక్టోబరు 30న ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌లో జరగనున్న నాలుగో టీ20కి అత్యధిక డిమాండ్‌ ఉన్నట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది.

అభిమానుల నుంచి భారీ స్పందన రావడంతో స్టేడియంలోని ఆరో అంచె సీటింగ్‌ను తొలిసారిగా తెరవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.

భారత్‌ పర్యటనకు ముందే టికెట్లకు వస్తున్న స్పందనతో ఈ సిరీస్‌పై నెలకొన్న క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

టీమ్ఇండియా.. న్యూజిలాండ్‌ టూర్‌ ఇలా..

ఐదు టీ20ల సిరీస్:

అక్టోబర్ 22 - తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్‌)

అక్టోబర్ 24 - రెండో టీ20 (క్రైస్ట్‌చర్చ్‌)

అక్టోబర్ 27 - మూడో టీ20 (వెల్లింగ్టన్)

అక్టోబర్ 30 - నాలుగో టీ20 (ఆక్లాండ్)

నవంబర్ 1 - ఐదో టీ20 (హామిల్టన్)

ఐదు వన్డేల సిరీస్:

నవంబర్ 4 - తొలి వన్డే (ఆక్లాండ్)

నవంబర్ 7 - రెండో వన్డే (వెల్లింగ్టన్)

నవంబర్ 10 -మూడో వన్డే (హామిల్టన్)

నవంబర్ 13 -నాలుగో వన్డే (మౌంట్ మౌంగనుయి)

నవంబర్ 15 - ఐదో వన్డే (మౌంట్ మౌంగనుయి)

రెండు టెస్టుల సిరీస్:

నవంబర్ 19-23: తొలి టెస్టు (వెల్లింగ్టన్)

నవంబర్ 27-డిసెంబరు 1: రెండో టెస్టు (క్రైస్ట్‌చర్చ్)

ADVERTISEMENT