T20 World Cup 2026: సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాకు షాక్.. ఫైనల్‌లో న్యూజిలాండ్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్-2026లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సెమీఫైనల్ పోరులో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో కివీస్ పూర్తిగా ఆధిపత్యం చాటుతూ ఏకపక్షంగా విజయం సాధించింది. కేవలం 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ప్రటీస్ జట్టులో Marco Jansen అర్థశతకంతో మెరిసాడు. అలాగే Dewald Brevis 34 పరుగులు, Tristan Stubbs 29 పరుగులు చేసి జట్టుకు సహకరించారు. దీంతో న్యూజిలాండ్ ముందుకు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
వివరాలు
6వ ఓవర్ లో 22 పరుగులు
170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు అద్భుత ఆరంభం అందించారు. వారి దూకుడైన బ్యాటింగ్‌కు ప్రోటీస్ బౌలర్లు పూర్తిగా ఒత్తిడికి గురయ్యారు. న్యూజిలాండ్ బ్యాటర్లు కేవలం 13 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. ఓపెనర్లు ఫిన్ అల్లెన్, టిమ్ సీఫెర్ట్ దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ బౌలర్లను వరుసగా మార్చినా ఫలితం మాత్రం మారలేదు. మ్యాచ్‌లో 6వ ఓవర్ వేసిన కార్బిన్ బాష్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ వరుసగా ఐదు బౌండరీలు (6, 4, 4, 4, 4) బాదుతూ ఆ ఓవర్‌లోనే 22 పరుగులు సాధించాడు. ఫిన్ అలెన్ కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేసి అద్భుత సెంచరీ సాధించాడు.
వివరాలు
117 పరుగుల వద్ద తోలి వికెట్ కోల్పోయిన కివీస్
మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసి అర్థశతకం నమోదు చేశాడు. అయితే అతను అనంతరం రబడా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ తొలి వికెట్‌ను 117 పరుగుల వద్ద కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రవీంద్రతో కలిసి ఫిన్ అలెన్ మ్యాచ్‌ను సులభంగా ముగించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ 2.5 ఓవర్లలోనే 53 పరుగులు ఇచ్చాడు. అలాగే కోర్బిన్ బాష్ 35 పరుగులు,లేశావ్ మహారాజ్ 33 పరుగులు,కగిసో రబడా 28 పరుగులు, లుంగి న్గిడి 22 పరుగులు సమర్పించారు. ప్రోటీస్ బౌలర్లలో రబడా ఒక్కడే ఒక వికెట్ తీసుకోగా,మిగతా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.