Page Loader
World Cup 2023: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. సారిథిగా కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. సారిథిగా కేన్ విలియమ్సన్

World Cup 2023: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. సారిథిగా కేన్ విలియమ్సన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2023
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచ కప్ 2023 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన జట్టును ప్రకటించింది. సారథిగా కేన్ విలియన్స్, వైస్ కెప్టెన్‌గా టామ్ లాథమ్ ఎంపికయ్యారు. గాయం కారణంగా ఆరు నెలలు జట్టుకు దూరమైన విలియమ్సన్ ఇప్పుడు పూర్తి ఫిట్ నెస్ ను సాధించాడు. మరోవైపు ఆల్ రౌండర్లు రచిన్ రవీంద్ర, మార్క్ చాప్ మాన్ కు అవకాశం దక్కింది. ఇక విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ పై సెలెక్టర్లు వేటు వేయగా, గాయం కారణంగా ఆడమ్ మిల్నే టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ లేని జిమ్మీ నీష‌మ్, ట్రెంట్ బౌల్ట్‌ ఈ స్క్వాడ్‌లో చోటు ద‌క్కించుకున్నారు

Details

న్యూజిలాండ్ వరల్డ్ కప్  జట్టు ఇదే

విలియమ్సన్, డారిన్ మిచెల్, డెవాన్ కాన్వే, ఫిలిప్స్, చాప్‌మన్, విల్ యంగ్​తో కివీస్ బ్యాటింగ్ పటిష్టంగా ఉండగా, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీలతో పేస్​ బలంగా ఉంది. న్యూజిలాండ్ స్క్వాడ్‌ : కేన్ విలియ‌మ్స‌న్(కెప్టెన్), మార్క్ చాప్‌మ‌న్, డెవాన్ కాన్వే, టామ్ లాథ‌మ్(వైస్ కెప్టెన్, వికెట్ కీప‌ర్), డారిల్ మిచెల్, జిమ్మీ నీష‌మ్, గ్లెన్ ఫిలిఫ్స్, ర‌చిన్ ర‌వింద్ర‌, మిచెల్ సాంట్న‌ర్, ఇష్ సోధీ, విల్ యంగ్, ట్రెంట్ బౌల్ట్‌, టిమ్ సౌథీ, ల్యూకీ ఫెర్గూస‌న్, మ్యాట్ హెన్రీ.