NZ vs SA: సౌతాఫ్రికాపై గెలుపు.. ఫైనల్‌లో భారత్‌తో తలపడనున్న న్యూజిలాండ్
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ సత్తా చాటింది. సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ గెలుపుతో ఫైనల్ మ్యాచులో టీమిండియాతో న్యూజిలాండ్ తలపడనుంది.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 362 పరుగుల భారీ స్కోరు చేసింది.
భారీ టార్గెట్ ను చేధించే క్రమంలో సౌతాఫ్రికా ఒత్తిడిని తట్టుకోలేక వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది.
చివరికి సౌతాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 312 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో టెంబ బావుమా (56), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (69) రాణించారు.
చివర్లో మిల్లర్ (98*) పరుగులతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
Details
రాణించిన న్యూజిలాండ్ బౌలర్లు
న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3 వికెట్లతో చెలరేగరా, ఫిలిప్స్, హెన్సీ తలా రెండు వికెట్లు తీశారు.
కేన్ విలియమ్సన్ (102), రచిన్ రవీంద్ర (108) సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయగలిగింది.
డారిన్ మిచెల్ (49), ఫిలిప్స్ (49) పరుగులతో రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో నిగిడి మూడు వికెట్లు తీయగా, రబడ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈనెల 9న ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో టీమిండియా, భారత జట్టు తలపడనున్నాయి.