
NZ Vs AFG: వరుసగా నాలుగో మ్యాచులో న్యూజిలాండ్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది.
తాజాగా చైన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచులో కివీస్ 149 పరుగుల తేడాతో గెలుపొందింది.
దీంతో టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. టామ్ లాథమ్(68), గ్లెన్ ఫిలిప్స్(74) అద్భుతంగా రాణించడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోరును చేసింది.
లక్ష్య చేధనకు దిగిన ఆఫ్గానిస్తాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులు చేసి ఆలౌటైంది.
Details
ఫిలిప్స్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
ఆఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ (36), అజ్మతుల్లా 27 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు.
కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్, సాంట్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇక హెన్రీ, రచిన్ రవీంద్ర చెరో వికెట్లు తీసి ఫర్వాలేదనిపించారు.
ఈ మ్యాచులో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఫిలిప్స్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
కివీస్ ఈ విజయంలో టోర్నీలో ఆడిన 4 మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
149 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
New Zealand continue their unbeaten run in #CWC23 with yet another emphatic win in Chennai 👊#NZvAFG 📝: https://t.co/R2WCgfr1UR pic.twitter.com/GTsrXdBYh3
— ICC (@ICC) October 18, 2023