#NewsBytesExclusive: ఐపీఎల్‌లో గ్రేమ్ స్మిత్ సందడి.. దక్షిణాఫ్రికా గ్రేట్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అంటూ వ్యాఖ్య
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఐపీఎల్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో గొప్ప ఆటగాడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా ఏబీ డివిలియర్స్ ను ఎంపిక చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అధికారిక భాగస్వామి Betwayతో కలిసి NewsBytes అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. అంతేకాదు, ఫ్రాంచైజీ లీగ్స్‌కు ఆటగాళ్లు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అంతర్జాతీయ క్రికెట్‌పై పడుతున్న ప్రభావంపై కూడా ఆయన స్పందించారు.
వివరాలు
అతను అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకరు..
ఐపీఎల్‌లో దక్షిణాఫ్రికా నుంచి గొప్ప ఆటగాడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ.. "నేను ఫాఫ్ డుప్లెసిస్‌ను తక్కువ చేయడం లేదు, కానీ నాకు AB డివిలియర్స్ గొప్ప ఆటగాడు అనిపిస్తాడు" అని అన్నారు. "అతను దక్షిణాఫ్రికా క్రికెట్‌లో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకరు. ఆటను పూర్తిగా మార్చే స్టైల్, ప్రదర్శన ఉన్న ఆటగాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. AB అలాంటి వ్యక్తి. అతని బ్యాటింగ్ అన్ని వైపులా రన్స్ చేయగల సామర్థ్యం ప్రత్యేకం" అని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్‌లో చిన్న ఫార్మాట్లలో బౌలర్లపై దాడి చేయడంలో ఆయన అసాధారణ ప్రతిభ చూపించారని కూడా స్మిత్ వివరించారు.
వివరాలు
SA20 వల్ల ఆటగాళ్లకు మంచి అవకాశాలు..
దక్షిణాఫ్రికా క్రికెట్‌లో ఆటగాళ్లను నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానంగా.. SA20 లీగ్ పెద్ద పాత్ర పోషిస్తోందని గ్రేమ్ స్మిత్ అన్నారు. ఈ లీగ్ వల్ల ఆటగాళ్లకు ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. SA20 లేకపోయి ఉంటే దక్షిణాఫ్రికా క్రికెట్‌లో ఫ్రీ ఏజెన్సీ పరిస్థితి చాలా తీవ్రంగా ఉండేదని చెప్పారు. ప్రస్తుతం సుమారు 20 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారని కూడా ఆయన వెల్లడించారు. SA20 ఇచ్చిన వేదిక వల్ల ఆటగాళ్లకు మంచి అవకాశాలు, ఆదాయం రెండూ పెరిగాయని అన్నారు.
వివరాలు
దక్షిణాఫ్రికా జట్టుకు అదే పెద్ద నష్టం..
ఇక హెన్రిచ్ క్లాసెస్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం దక్షిణాఫ్రికాకు పెద్ద నష్టమని స్మిత్ వ్యాఖ్యానించారు. ఇది కుటుంబ కారణాలతో సంబంధం ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే డేవిడ్ మిల్లర్ విషయంలో మాత్రం, ఆయన సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేకపోయినా 2027 వరల్డ్ కప్ వరకు జట్టుకు అందుబాటులో ఉంటారని తాను భావిస్తున్నానని చెప్పారు. క్రికెట్ సౌత్ ఆఫ్రికాతో మిల్లర్ ఇప్పటికే మాట్లాడి ఉండొచ్చని కూడా ఆయన అంచనా వేశారు.
వివరాలు
బౌలర్ల పాత్ర కీలకం..
SA20 లీగ్ ఐపీఎల్ కంటే బ్యాలెన్స్‌గా ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ, గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. SA20లో 'ఇంపాక్ట్ ప్లేయర్' నియమం లేకపోవడంతో బౌలర్ల పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పిచ్‌లు ఐపీఎల్‌లా ఎప్పుడూ ఒకేలా ఉండవని, పరిస్థితులు మారుతూ ఉంటాయని వివరించారు. ఆస్ట్రేలియాతో పోలిస్తే అక్కడ బౌండరీలు పెద్దవిగా ఉంటాయని కూడా గుర్తుచేశారు. పవర్ హిట్టింగ్ టోర్నమెంట్‌లో ముందుకు తీసుకెళ్తుందన్నప్పటికీ, కీలక సమయాల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పేది బౌలర్లే అని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆ కీలక బౌలింగ్ ప్రదర్శనే జట్లకు విజయాలు అందిస్తుందని గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డారు.