ఐపీఎల్‌లో నికోలస్ పూరన్ సంచలన రికార్డు
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య అఖరి బంతి వరకూ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై లక్నో ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 212 పరుగులు చేసింది. భారీ లక్ష్య చేధనకు బరిలోకి దిగిన లక్నో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో స్టోయినిస్ 30 బంతుల్లో 65 పరుగులు చేసి గెలుపు ఆశలను రేకెత్తించాడు.స్టోయినిస్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా అతను చరిత్రకెక్కాడు.
మొదటి స్థానంలో కేఎల్ రాహుల్
2018 లో కేఎల్ రాహుల్ 14 బంతుల్లోనే ఐపీఎల్‌లో అర్ధ సెంచరీని నమోదు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. యుసఫ్ పఠాన్, సునీల్ నరైన్, నికోలస్ పూరన్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీని చేశాడు. 2023 ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ పై అంజిక్య రహానే కేవలం 19 బంతుల్లోనే 50 పరుగుల మార్కును దాటుకున్నాడు. 19 బంతుల్లో (7 సిక్సర్లు, 4 ఫోర్లు) 62 పరుగులు చేయడం విశేషం