Page Loader
మేజ‌ర్ లీగ్‌లో నికోల‌స్ పూరన్ భారీ విధ్వంసం.. టైటిల్ గెలిచిన ఎమ్ఐ న్యూయార్క్‌    
40 బంతుల్లోనే సెంచరీీ

మేజ‌ర్ లీగ్‌లో నికోల‌స్ పూరన్ భారీ విధ్వంసం.. టైటిల్ గెలిచిన ఎమ్ఐ న్యూయార్క్‌    

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 31, 2023
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

మేజ‌ర్ లీగ్ క్రికెట్‌లో నికోల‌స్ పూర‌న్ విధ్వంసం సృష్టించాడు. బ్యాటుతో వీర బాదుడు బాదాడు. కేవ‌లం 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.అంతటితో ఆగకుండా 55 బంతుల్లోనే 137 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టును ఊచకొత కోశాడు. మొత్తం ప‌ద‌మూడు సిక్స‌ర్లు, ప‌ది ఫోర్ల‌తో 137 పరుగులు చేసి ఎమ్ఐ (MI) న్యూయార్క్‌ జట్టుకు మేజర్ లీగ్ టైటిల్ కప్ ను సాధించి పెట్టాడు. మరోవైపు టీ-20 లీగ్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచ‌రీ కొట్టిన క్రికెట‌ర్ల‌లో ఒక‌డిగా పూర‌న్‌ చరిత్రకెక్కాడు. మేజ‌ర్ లీగ్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ,హాఫ్ సెంచ‌రీల‌తో రికార్డు సృష్టించాడు.కేవ‌లం 16 బాల్స్‌లోనే అర్థ సెంచ‌రీ పూర్తి చేసిన పూర‌న్‌ ప్రత్యర్థుల నుంచి టైటిల్ లాగేసుకున్నాడు.

DETAILS

9 ఓవ‌ర్ల‌లోనే 109 పరుగులు రాబట్టిన ఎమ్ఐ (MI) న్యూయార్క్‌ జట్టు

మేజ‌ర్ లీగ్ క్రికెట్ లో భాగంగా సీటెల్ ఓర్కాస్‌, ఎమ్ఐ న్యూయ‌ర్క్ జ‌ట్ల మ‌ధ్య సోమ‌వారం ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన సీటెల్ ఓర్కాస్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల నష్టానికి 183 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. డికాక్ 52 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. 184 రన్స్ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎమ్ఐ(MI) న్యూయార్క్‌ తొలి ఓవర్లోనే వికెట్ నష్టపోయింది. మూడో స్థానంలో బ్యాట్ పట్టిన పూర‌న్ 2 వ‌రుస సిక్సుల‌తో ఖాతా ప్రారంభించాడు. పూరన్ మెరుపుల‌తో న్యూయార్క్ 9 ఓవ‌ర్ల‌లో 109 పరుగులు రాబట్టింది.చివరి వరకు సిక్సుల మోతతో ఏడు వికెట్ల తేడాతో సీటెల్ ఓర్కాస్‌పై ఘన విజయం సాధించి కప్ ను ఒడిసిపట్టింది.