Page Loader
Major League Cricket: ఫ్లే ఆఫ్స్‌కు చేరిన టెక్సాస్ సూపర్ కింగ్స్
ఫ్లే ఆఫ్స్‌కు చేరిన టెక్సాస్ సూపర్ కింగ్స్

Major League Cricket: ఫ్లే ఆఫ్స్‌కు చేరిన టెక్సాస్ సూపర్ కింగ్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2023
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

మేజర్ లీగ్ క్రికెట్ లో టెక్సాస్ సూపర్ కింగ్స్ ఫ్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. శాన్ ఫ్రాన్సిస్కో జట్టుతో జరిగిన మ్యాచులో సూపర్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో డేనియల్ సామ్స్ 18 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 4 మ్యాచుల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించిన సీయాటిల్ ఆర్కాస్, 5 మ్యాచుల్లో 3 విజయాలతో వాషింగ్టన్ ఫ్రీడం జట్లు ఇప్పటికే ఫ్లే ఆప్స్ కు అర్హత సాధించాయి. మరో బెర్తు కోసం ముంబై న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో జట్లు పోటీపడుతున్నాయి.

Details

ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన సామ్స్

ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్ 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ 49, చైతన్య బిష్ణోయ్ 35 పరుగులతో రాణించారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 4 వికెట్లతో చెలరేగాడు. సూపర్ కింగ్స్ తరుపున సామ్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బౌలింగ్ లో రెండు వికెట్లు పడగొట్టగా.. బ్యాటింగ్ 42 పరుగులు చేసి జట్టు విజయంలో ప్రధాన పోత్ర పోషించాడు. యునికార్న్స్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌, షాదాబ్‌ ఖాన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.